కళాశాలల మంజూరుకు సీఎంకు వినతి
VZM: బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబును కలిసి నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై వినతిపత్రాలు సమర్పించారు. బొబ్బిలిలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే లోచర్ల, శివడవలస గ్రామాలకు తోటపల్లి కాలువపై లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ త్వరగా మంజూరు చేయాలన్నారు. సీఎం సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.