'సిబ్బంది సమయపాలన పాటించాలి'

'సిబ్బంది సమయపాలన పాటించాలి'

AKP: ప్రజలకు సత్వర సేవలు అందించాలని నాతవరం డిప్యూటీ ఎంపీడీవో కూర్మారావు అన్నారు. నాతవరం మండలం వైడిపేట సచివాలయాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా హాజరు పట్టిక, మూమెంట్ రిజిస్టర్ పరిశీలించారు. అనంతరం సిబ్బందితో సమావేశమై సమయపాలన పాటించాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు.