చివరి రోజు ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్న అభ్యర్థులు

చివరి రోజు ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్న అభ్యర్థులు

BDK: సర్పంచ్ ఎన్నికల ప్రచారం ఈ రోజుతో ముగుస్తున్న సందర్భంగా అశ్వాపురం పంచాయతీ నందు 6, 8, 9 వార్డ్ మెంబర్ల వారి వార్డుల్లో ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లను కలిసి తమ తమ ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ముత్తినేని సుజాత, వార్డు అభ్యర్థులు నూకల లింగయ్య, సవలం అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.