డిసెంబర్ 2న దివ్యాంగులకు ఆటల పోటీలు
MNCL: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 2న మంచిర్యాల బాయ్స్ హైస్కూల్ మైదానంలో దివ్యాంగుల ఆటల పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్ శనివారం ప్రకటనలో తెలిపారు. 18 సంవత్సరాల లోపు బాలబాలికలకు,18-54 వయసు గల మహిళా, పురుషుల దివ్యాంగులకు వేరువేరుగా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు సధరం, UDID తీసుకరావాలన్నారు.