'పేదల పెన్నిధి ముఖ్యమంత్రి సహాయనిధి'
SRCL: పేదల పెన్నిధి ముఖ్యమంత్రి సహాయనిధి అని కాంగ్రెస్ తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు టోనీ అన్నారు. తంగళ్ళపల్లి మండలం గోపాలరావుపల్లిలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా టోనీ మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించి వారికి అండగా ఉండటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.