VIDEO: 'ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి'
KMM: కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని బీజేపీ పాలేరు అసెంబ్లీ ఇంఛార్జ్ నున్నా రవికుమార్, మండల అధ్యక్షుడు పాగర్తి సుధాకర్ డిమాండ్ చేశారు. సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్, ఎంపీడీవోలకు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్న ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు.