రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం

రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం

MHBD: మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని మదర్ తెరిసా విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు ఇవాళ సంబరాలు జరుపుకున్నారు. దేశవ్యాప్త కులగణన పార్లమెంట్లో ఆమోదించిన సందర్బంగా పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ కృషి ద్వారానే ఇది సాధ్యమైనదని మహబూబాబాద్ అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఘనపురం అంజయ్య తెలిపారు.