'లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి'
ASR: పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులు, రక్షణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వీ.ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. సోమవారం పలు రంగాల కార్మికులు, నేతలతో కలిసి అరకులో సీఐటీయూ జెండాను ఆవిష్కరించారు. విశాఖలో జరిగే సీఐటీయూ మహాసభలు విజయవంతం చేయాలని కోరారు. కార్మికులకు నష్టం చేకూర్చే 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కోరారు.