రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే
E.G: కొవ్వూరులోని RTC బస్ స్టాండ్ వద్ద నుంచి మెరక వీధి వరకు BT రోడ్డు మరమ్మతు పనులను కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర రావు శనివారం ప్రారంభించారు. ఈ అభివృద్ధి పనులకు జనరల్ ఫండ్ ద్వారా రూ.20 లక్షలు మంజూరైనట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సూరపని చిన్ని, దాయన రామకృష్ణ, వేమగిరి వెంకట్రావ్, బేతిన నారాయణ, భావన రత్న కుమారి తదితరులు పాల్గొన్నారు.