వరంగల్ రైల్వే స్టేషన్‌లో డ్రగ్స్ కంట్రోల్ టీం తనిఖీలు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మత్తు పదార్థాల నిర్మూలనే లక్ష్యంగా డ్రగ్స్ కంట్రోల్ టీం శనివారం రైల్వే స్టేషన్‌లో తనిఖీలు చేపట్టింది. అనుమానితుల బ్యాగులు, స్టేషన్ పరిసరాలను పరిశీలించిన పోలీసులు, మత్తు పదార్థాల రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.