CMRF చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

PPM: పాలకొండ మండలం పణుకువలస గ్రామానికి చెందిన పొట్నూరు కూర్మారావుకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరు అయిన రూ. 2 లక్షల చెక్కును ఎమ్మెల్యే జయకృష్ణ ఆదివారం అందజేశారు. కూర్మరావుకు ఇటీవల పక్షవాతం వచ్చి మంచాన పడ్డారు. ఆయనకు చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదలకు సీఎంఆర్ఎఫ్ ఓ వరం లాంటిదన్నారు.