ఒడిశాలో ప్రమాదంశాత్తు ఉణుకూరు వాసి మృతి

ఒడిశాలో ప్రమాదంశాత్తు ఉణుకూరు వాసి మృతి

vzm: ఉణుకూరు గ్రామానికి చెందిన కడగల రాము (52) ఒడిశాలో శుక్రవారం మరణించారు. పూరి జిల్లా పిప్పిలిలో నివసిస్తున్న ఆయన స్నానానికి కాలువకు వెళ్లి కాలుజారి నీటిలో పడి మృతి చెందారు. ఉపాధి కోసం రాము 30 ఏండ్లుగా ఒడిశాలో ఉంటున్నట్లు కుటుంబ సభ్యులు అన్నారు. పూరి ఏరియల్ ఆసుపత్రిలో పంచనామా అనంతరం శనివారం ఉదయం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చారు.