శ్రీశైలంలో రెండో రోజు ఉగాది మహోత్సవాలు
AP: శ్రీశైల క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ రెండో రోజు భ్రమరాంబ అమ్మవారు మహా దుర్గాదేవి అలంకరణలో దర్శనమిస్తారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు కైలాస వాహనసేవ, ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి లక్షలాది మంది భక్తులు నల్లమల అటవీమార్గంలో పాదయాత్రగా శ్రీశైలానికి చేరుకుని, అమ్మవారికి సారే సమర్పిస్తారు.