'జొన్నల కొనుగోలు కేంద్రాల సమస్యలు పరిష్కరించాలి'

SRD: జిల్లాలోని జొన్న కొనుగోలు కేంద్రాల్లో ఉన్న సమస్యల పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ బుధవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. జొన్నల కొనుగోలు నిదానంగా సాగుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. అధికారులు స్పందించి జొన్నల కొనుగోలు వేగవంతం చేయాలని కోరారు.