చేబ్రోలు ఉపాధ్యాయురాలికి ఉత్తమ టీచర్ అవార్డు
GNTR: రాష్ట్ర ప్రభుత్వం నేడు ఇవ్వబోయే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు చేబ్రోలు మండలం చీలిపాలెం జడ్పీ మోడల్ స్కూల్‌లో ఎస్జీటీ ఉపాధ్యాయురాలు అవ్వారి భద్రవతి ఎంపికయ్యారు. ఆమె 1, 2, 9 తరగతుల తెలుగు పాఠ్యపుస్తకాల రచయితగా సేవలందించారు. ఈ సందర్భంగా భద్రవతిని పలువురు అభినందించారు. ఉత్తమ ఉపాద్యాయురాలుగా అవార్డు రావడం గౌరవంగా ఉందని ఆమె పేర్కోన్నారు.