సుబ్రహ్మణ్యస్వామికి పట్టు వస్త్రాలను సమర్పించిన TTD ఛైర్మన్

TPT: ఆడికృత్తిక పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి TTD తరఫున సారె సమర్పించే భాగ్యం తనకు లభించిందని TTD ఛైర్మెన్ బీఆర్. నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆలయ అధికారులు, వేదపండితుల సన్నిధిలో మంగళవాయిద్యాలతో స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి ఆశీర్వాదం పొందారు.