గదుల ఆధారంగా విద్యుత్ కనెక్షన్‌లు

గదుల ఆధారంగా విద్యుత్ కనెక్షన్‌లు

HYD: గ్రేటర్‌లో విద్యుత్ కనెక్షన్‌ల కనీస లోడ్‌ను SPDCL గణనీయంగా పెంచింది. వినియోగం ఆధారంగా కాకుండా గదుల ఆధారంగా లోడ్‌ను అంచనా వేస్తోంది. అపార్ట్ మెంట్లలో తక్కువ లోడ్ కనెక్షన్లు తీసుకుని అధిక లోడ్ వాడకంతో అగ్నిప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో మెట్రోజోన్ ఆపరేషన్ చీఫ్ ఇంజినీర్ కొత్త ప్రతిపాదనను సీఎండీ ఆమోదించారు. అపార్ట్ మెంట్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది.