తాగునీటి సమస్యలకు టోల్ ఫ్రీ నెంబర్

WGL: జిల్లాలో తాగునీటి సమస్యలు తలెత్తితే కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్18004253424కు సమాచారం అందించాలని కలెక్టర్ సత్యశారద మంగళవారం ప్రకటించారు. వేసవిలో గ్రామాల్లో నీటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని అన్నారు.