నేటి నుంచే ఫ్లై91 సర్వీసులు
AP: విజయవాడ-హైదరాబాద్ ప్రయాణికులకు శుభవార్త వచ్చేసింది.ఇవాళ్టి నుంచి ఫ్లై91 విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఉ.7:30 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి HYDకు తొలి సర్వీసు బయలుదేరుతుంది. రెండు నగరాల మధ్య రాకపోకలు సాగించే వారికి ఈ సర్వీసులు ఎంతో ఊరటనివ్వనున్నాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ కొత్త విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చారు.