సీతక్కను విమర్శిస్తే ఊరుకునేది లేదు: రవియాదవ్
MLG: నిత్యం ప్రజల మధ్య ఉండే మంత్రి సీతక్కను విమర్శిస్తే ఊరుకునేది లేదని ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు వంగ రవి యాదవ్ అన్నారు. ములుగులో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. BRS పార్టీలో కొందరు చిల్లర నాయకులు కావాలని సీతక్కపై అసత్య ఆరోపణలు చేస్తూ, అబద్ధపు ప్రచారాలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని అన్నారు.