ఈ నెల 26న కొక్కెరంచలో ఎద్దుల బండలాగుడు పోటీలు
NDL: కొత్తపల్లె మండలం కొక్కెరంచలో క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ నెల 26న బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు సోమవారం నిర్వాహకులు తెలిపారు. గెలుపొందిన ఎద్దుల యజమానులకు వరుసగా మొదటి బహుమతిగా రూ. 40 వేలు, రెండో బహుమతి రూ.30 వేలు, మూడో బహుమతి రూ.20 వేలు, నాలుగో బహుమతి రూ.10 వేలు అందించనున్నట్లు పేర్కొన్నారు.