22న విద్యుత్తు లోక్ అదాలత్

అన్నమయ్య: చిట్వేలు సబ్ స్టేషన్‌లో 22వ తేదీన ఉదయం 11 నుంచి మధ్యాహ్నం1:00 గంట వరకు ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహించనున్నట్లు రాజంపేట విద్యుత్ శాఖ EE N.రాజశేఖర్ రెడ్డి తెలిపారు. విద్యుత్ అదాలత్‌లో రిటైర్డ్ జడ్జి, ఆర్థిక, సాంకేతిక సభ్యులు జీ.మధుకుమార్ పాల్గొంటారన్నారు. పెనగలూరు, పుల్లంపేట, చిట్వేలి మండలాల పరిధిలోని యోగదారులు సమస్యల పరిష్కారం కొరకు హాజరు కావాలన్నారు.