హాలహర్వి పోలీసు స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ
KRNL: హాలహర్వి పోలీసు స్టేషన్‌ను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ బుధవారం వార్షిక తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుల్లో పెండింగ్ కేసులు వాటి స్థితిగతులు, నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తులు, వాటి పురోగతి పై కేసుల ఫైళ్ళను క్షుణ్ణంగా పరిశీలించారు. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల గురించి ఆరా తీశారు.