విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో గూడూరి ఎరిక్షన్ బాబు
ప్రకాశం: పుల్లలచెరువు మండలం కవలకుంట్లు గ్రామంలోని శ్రీ పట్టాభి సీతారామ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో యర్రగొండపాలెం టీడీపీ ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి తనవంతుగా సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయుకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.