VIDEO: ముచ్చింతలలో పర్యటించిన ట్రైని కలెక్టర్లు
NTR: పెనుగంచిప్రోలు మండలం ముచ్చింతల గ్రామంలో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వానికి నూతనంగా నియమితులైన ఏడుగురు కలెక్టర్లు శిక్షణలో భాగంగా మూడు రోజులపాటు పర్యటిస్తున్నారు. గ్రామాల్లో ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు విధానాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ అవగాహన పొందుతున్నారు.