కర్రలతో దాడి.. కోమాలో చేరిన వ్యక్తి

కర్రలతో దాడి.. కోమాలో చేరిన వ్యక్తి

VSP: నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి బుక్కా వీధిలో మైలిపిల్లి సాగర్, అతని కుటుంబ సభ్యులపై ఓ గొడవ నేపథ్యంలో యజ్ఞ నీలవేణి, ఆమె కుమారులు శనివారం రాత్రి కర్రలతో దాడి చేశారు. దీంతో సాగర్ కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని కేజీహెచ్‌లో చేర్పించగా సాగర్ సోదరుడు కోమాలోకి చేరాడు. ఘటనపై సీఐ వరప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.