గుడిపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో సమ్మర్ క్యాంప్

NLG: గుడిపల్లి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నుంచి సమ్మర్ క్యాంప్ నిర్వహించనున్నట్లు హెచ్ఎం సముద్రాల శ్రీనయ్య తెలిపారు. ఈ క్యాంపులో ఆటలు, పాటలు, డాన్సులు వంటివి నేర్పించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు రేపటి నుంచి పాఠశాలకు రావలసిందిగా పేర్కొన్నారు. స్నాక్స్, రాగిజావ అందజేయనున్నారు.