జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

BHPL: కాటారం-భూపాలపల్లి జాతీయ రహదారి 353(సి)పై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇసుక లారీ బలంగా ఢీకొనడంతో కారు ధ్వంసమైందని ప్రయాణికులు తెలిపారు. ప్రమాద స్థలంలో భయానక వాతావరణం నెలకొనగా, వాహనదారులు హడలిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.