ప్రజావాణిలో ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ
STPT: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నరసింహా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును పరిశీలిస్తూ సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్ ద్వారా అవసరమైన సూచనలు ఇచ్చారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎలాంటి ఆలస్యం చేయద్దని, ప్రతి కేసును పారదర్శకంగా దర్యాప్తు చేయాలని అధికారులకు ఆదేశించారు.