రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి

PDPL: సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల రాజీవ్ రహదారిపై కారు ఢీకొన్న ఘటనలో ఇదే గ్రామానికి చెందిన రాపెళ్లి రాజేశం(72) అక్కడికక్కడే మృతిచెందాడు. SI శ్రావణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజేశం ఇంట్లోని చెత్తను ఇంటి ముందు ఉన్న చెత్తకుండీలో వేసి వెనుకకు తిరిగి వెళ్తున్నాడు. ఈ క్రమంలో కరీంనగర్-పెద్దపల్లి వైపు అతివేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టిందని ఎస్ఐ పేర్కొన్నారు.