తాడిపత్రి వ్యవసాయ ఏడీ బాధ్యతల స్వీకరణ

ATP: తాడిపత్రి వ్యవసాయ ఏడీగా రవి బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పని చేసిన చెంగల రాయుడు బదిలీపై కర్నూలు జిల్లా ఆలూరుకు వెళ్లగా అతని స్థానంలో అనంతపురం నుంచి తాడిపత్రి ఏడీగా రవి బాధ్యతలు తీసుకున్నారు. వ్యవసాయానికి సంబంధించి సిబ్బందితో ఆయన సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న సమస్యల గురించి తెలుసుకున్నారు.