ఆదివాసీ దినోత్సవంపై నేడు సమీక్షించనున్న మంత్రి

VZM: గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంద్యారాణి ఆదివాసి దినోత్సవంపై శనివారం సమీక్ష నిర్వహించనన్నారు. ఈ మేరకు పార్వతీపురం జిల్లా రెవెన్యూ అధికారి కె. హేమలత ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు హాజరు కావాలని ఆమె సూచించారు.