రోడ్డు ప్రమాదం.. పలువురికి గాయాలు
KDP: మైదుకూరు మండలం శ్రీనగరం వద్ద NH-40పై ఇవాళ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందుగా వెళ్తున్న RTC బస్సును హైదరాబాదుకు చెందిన మహీంద్రా థార్ కారు వెనుక నుంచి ఢీకొట్టినట్లు స్థానికలు తెలిపారు. ఈ ఘటనలో యశ్వంత్ (22), సతీశ్ (24) తీవ్రంగా గాయపడ్డారు. రూప (20), మధు(19), సృజన్(25)కు స్వల్ప గాయాలయ్యాయి. అంబులెన్స్‌లో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.