అనధికారికంగా మద్యం విక్రయిస్తున్న 18 మందిపై బైండోవర్

అనధికారికంగా మద్యం విక్రయిస్తున్న 18 మందిపై బైండోవర్

VZM: నెల్లిమర్ల మండలంలోని వివిధ గ్రామాల్లో అనధికారికంగా మద్యం అమ్ముతూ.. పట్టుబడిన 18 మంది వ్యక్తులను ఇవాళ ఎక్సైజ్‌ అధికారులు స్థానిక తహసీల్దార్‌ శ్రీకాంత్ ఎదుట హాజరు పరిచారు. ఈ మేరకు తహసీల్దార్ వారికి ఏడాదిపాటు బైండోవర్‌ విధించారు. ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షలకు పూచీకత్తు తీసుకున్నారు. మళ్లీ మద్యం అమ్మితే రూ.2 లక్షలు ఫైన్‌ చెల్లించాల్సిఉంటుందని హెచ్చరించారు.