సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో గంజాయి పట్టివేత

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో గంజాయి పట్టివేత

HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో గంజాయి కలకలం రేపింది. ఒడిశా నుంచి ముంబయికి ఇద్దరు వ్యక్తులు ఎల్‌టీటీ ఎక్స్ ప్రెస్‌లో గంజాయి తరలిస్తుండగా పోలీసుల తనిఖీలో పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి 18 కిలోల గంజాయిని రైల్వే పోలీసులు స్వాధినం చేసుకున్నారు. అనంతరం నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.