సర్కిల్ ఇన్స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సత్యనారాయణ

KMM: ఇల్లందు నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్‌గా బత్తుల సత్యనారాయణ శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. గతంలో టేకులపల్లి, కొత్తగూడెం నందు విధులు నిర్వహించిన సత్యనారాయణ నిజామాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు. అక్కడనుంచి మళ్లీ ఇల్లందుకు బదిలీపై రావడంతో పలు రాజకీయ పార్టీల నాయకులు, పాత్రికేయులు, స్వచ్ఛంద సేవా సంస్థల నాయకులు కలిసి నూతన సిఐ కి శుభాకాంక్షలు తెలిపారు.