మంత్రి నిమ్మలతో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే భేటీ
ATP: విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని బి.టి.పి (భైరవానితిప్ప) ప్రాజెక్టు పనులను త్వరతిగతిన పూర్తి చేసేలా సహకరించాలని మంత్రికి విన్నవించారు. సాగునీటి అవసరాల దృష్ట్యా పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేయాలని కోరారు.