VIDEO: మల్లికార్జున స్వామిని దర్శించుకున్న మంత్రి
HNK: ఐనవోలు మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామిని ఇవాళ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కాసేపు సందడి చేసిన ఆమె, స్థానిక మహిళా వ్యాపారుల నుంచి పూసల దండలను స్వయంగా ఎంపిక చేసి కొనుగోలు చేశారు. వ్యాపారుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.