నేడు నులిపురుగుల నివారణ దినోత్సవం..!
CTR: జిల్లాలో మంగళవారం నులి పురుగుల నివారణ దినోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లావ్యాప్తంగా 3.62 లక్షల మందికి ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నట్టు కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడించారు. ఈరోజు మధ్యాహ్నం భోజనం అనంతరం మాత్రలు పంపిణీ చేస్తామని, ఎవరైనా మిగిలిపోతే ఈనెల 24న మళ్లీ పంపిణీ చేస్తామని తెలిపారు.