వెంకేపల్లిలో రూ.5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం
SRPT: నూతనకల్ మండలం వెంకేపల్లిలో మౌలిక వసతుల కల్పన అధిక ప్రాధాన్య మిస్తున్నట్లు సర్పంచ్ జయకుమార్ తెలిపారు. ఇవాళ ఉపాధి హామీ, ఎంపీ నిధులు రూ.5 లక్షలతో నూతన సీసీ రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. గ్రామాభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సైదులు , చంద్రారెడ్డి తదితరులు పాల్గొని పనులను పర్యవేక్షించారు.