VIDEO: 100 పడకల ఆసుపత్రి కోసం బైక్ ర్యాలీ
WGL: వర్ధన్నపేట పట్టణంలోనే 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనం నిర్మించాలని డిమాండ్ చేస్తూ మండల సాధన సమితి ఆధ్వర్యంలో ఆదివారం నాల్గోవ రోజు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి, నిరాహార దీక్షలు చేపట్టారు. పాత ఆసుపత్రి భవన ప్రాంగణంలోనే నిర్మాణం చేపట్టాలని, ఎమ్మెల్యే నాగరాజు స్పష్టమైన హామీ ఇచ్చి పనులు వెంటనే ప్రారంభించాలని దీక్షాకారులు డిమాండ్ చేశారు.