చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సౌమ్య
ఎన్టీఆర్: నందిగామ పురపాలక సంఘం ఆధ్వర్యంలో సమ్మర్ యాక్షన్ ప్లాన్-2026 కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వేసవికాలంలో ఎండ తీవ్రత అధికంగా ఉండే నేపథ్యంలో ప్రజలకు తాగునీటి కొరత లేకుండా చూడటం ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని తెలిపారు.