భద్రాద్రి ప్రజలకు పోలవరం బ్యాక్ వాటర్ భయం

BDK: వర్షాకాలం ప్రారంభమవడంతో భద్రాచలం వరద ముంపు ప్రాంతాల ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పోలవరం బ్యాక్ వాటర్ పలు ప్రాంతాలను ముంచెత్తుతాయని, 2022లో జరిగిన విధ్వంసం తలచుకొని విలవిల్లాడుతున్నారు. దాదాపు 700 మీటర్ల మేర చేపట్టిన కరకట్ట నిర్మాణ పనులు నత్త నడకన సాగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు.