VIDEO: విజయవంతంగా శ్రీవారి సారె ట్రయిల్ రన్
TPT: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం ట్రయల్ రన్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఈ నెల 17వ తేదీ నుంచి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తిరుపతిలోని కోమలమ్మ సత్రం నుంచి ఏనుగులపై శ్రీవారి సారె నమూనాను ఉంచి నగర వీధుల గుండా ఊరేగింపుగా తిరుచానూరుకు తీసుకువచ్చారు.