CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కృష్ణా: పెడన నియోజకవర్గ పరిధిలో వైద్య ఖర్చులు నిమిత్తం 33 మంది లబ్ధిదారులకు రూ.19,22,828 సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనారోగ్యానికి గురైన వారు ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బంది పడకుండా ఉండేందుకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సీఎం సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.