VIDEO: విడవలూరులో ప్రారంభమైన వరి కోతలు
NLR: విడవలూరు మండలంలోని పలు ప్రాంతాల్లో గత రెండు రోజులుగా వరి కోతలు జోరుగా జరుగుతున్నాయి. మండలం వ్యాప్తంగా దాదాపుగా రైతు సోదరులు రెండు కార్లు వరి పంటను సాగు చేస్తారు. సుమారుగా 20,200 ఎకరాల్లో వరి పంటను రైతన్నలు సాగు చేస్తారు. సోమశిల జలాశయం నుంచి రైతన్నలకు సాగునీరు అందుతోంది. కొంతమంది రైతులు తమ సొంత బోరు పంపుల ద్వారా వ్యవసాయం చేస్తుంటారు.