'చలివేంద్రాలను ఏర్పాటు చేయాలి'
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఎండలు రోజురోజుకు పెరుగుతున్న ప్రధాన చౌరస్తాలో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతూ పట్టణానికి చెందిన సిలారి నవీన్ సామాజిక కార్యకర్త అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లకు వినతిపత్రం అందించారు. వెంటనే స్పందించిన అదనపు కలెక్టర్ పట్టణంలోని ప్రధాన వీధుల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.