కర్నూలు జిల్లాను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతా: టీజీ భరత్

KRNL: జిల్లాను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని పరిశ్రమలు, ఆహార శుద్ధిశాఖ మంత్రి టీజీ భరత్ హమీ ఇచ్చారు. శనివారం కర్నూలులో ఆయన ఆంధ్రప్రదేశ్‌ను గుజరాత్ రాష్ట్రం తరహాలో పారిశ్రామికాభివృద్ధి చేస్తామన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు 21 రోజుల్లో సింగిల్ విండో క్లియరెన్స్‌కు చర్యలు తీసుకుంటామని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తామన్నారు.