పెట్రోల్ పంపు, గ్యాస్ ఏజెన్సీలకు అవగాహన సదస్సు

WGL: అగ్నిమాపక శాఖ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం వర్ధన్నపేట పట్టణంలోని పెట్రోల్ పంపులు గ్యాస్ ఏజెన్సీలకు ఫైర్ సిబ్బంది పాల్గొని, అగ్ని ప్రమాదాలు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాల సమయంలో ప్రథమ చికిత్స, ప్రాణాలను రక్షించుకోవడం పట్ల ప్రాక్టికల్ డెమో నిర్వహించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో ప్రజలందరూ బాగాస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.