'సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దుతాం'

WNP: గ్రామాలలో అన్ని మౌలికవసతులు కల్పించి సమస్యలులేని గ్రామాలుగా తీర్చిదిద్దుతామని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. మదనాపురం మండలం నెలివీడి నుంచి తాండా వరకు నూతనంగా ఏర్పాటు చేసిన బీటీ రోడ్డును శనివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గత పాలకుల 10ఏళ్ల పాలనలో గ్రామాలలో అభివృద్ధి కుంటుపడిందని ఎమ్మెల్యే విమర్శించారు.